|| దృశ్యం న్యూస్ ||
ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ గోల్డ్ మెడల్ సాధించారు. 50 మీటర్ల విభాగంలో రాహుల్ మొదటి స్థానంలో నిలచి గోల్డ్ మెడల్ సాధించి ఈ ప్రతిష్టాత్మక పోటీలలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
రాహుల్ గతంలోను పలు పోటీలలో విజయాలు సాధించి గోల్డ్ మెడల్స్ పొందాడు.
అయితే, ఒక మారుమూల గ్రామంలో జన్మించిన రాహుల్ ఈ విధంగా అర్చరీలో అత్యున్నత విజయాలను సాధించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ విజయాలు రాహుల్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మరియు నిజామాబాద్ జిల్లావాసులకు గర్వకారణంగా మారింది.








