బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బీసీ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు – సంజయ్ తల్లారే

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: అక్టోబర్ 18న జరుగనున్న బీసీ రాష్ట్ర బంద్‌కు బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు సుభాష్‌నగర్‌లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చే బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలిపినా, ఇప్పుడు హైకోర్టు స్టే తర్వాత వెనుకడుగు వేయడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీ ప్రజలందరూ బీసీ బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఉదయ్, రాకేష్, నరేందర్, మంగేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment