విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన – TGNPDCL ఇంజినీర్ల సూచనలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలోని ZPHS, ఏఆర్‌పి క్యాంపు పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కే. నగేష్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ కిషోర్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విలువైన సూచనలు అందించారు.

విద్యుత్ తీగలు వదులుగా ఉండడం, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు, వంగిన స్థంబాలు వంటి ప్రమాదకర పరిస్థితులు గమనించిన వెంటనే స్థానిక లైన్‌మన్ లేదా సెక్షన్ ఆఫీసర్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు. భారీ వర్షాలు, గాలి దుమారాల సమయంలో తెగిన తీగలు లేదా తడిగా ఉన్న స్థంబాలను తాకరాదని హెచ్చరించారు.
ఇంటింటా నాణ్యమైన వైరింగ్ ఉపయోగించాలి, ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి, రైతులు స్వయంగా కరెంట్ పనులు చేయకూడదని తెలిపారు. ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే TGNPDCL టోల్‌ఫ్రీ నంబర్ 1912‌ను సంప్రదించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment