|| దృశ్యం న్యూస్ ||
రుద్రూర్- స్వామి రాందేవ్ ఆధ్వర్యంలో నడిచే పతాంజలి విశ్వవిద్యాలయం ద్వారా గత నెల రోజులుగా నిర్వహించిన అసిస్టెంట్ యోగా టీచర్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని యోగ మరియు ధ్యాన కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పతాంజలి యోగ తెలంగాణ రాష్ట్ర మీడియా ప్రబారీ విశ్వనాధ్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వనాధ్ మహాజన్ మాట్లాడుతూ, యోగా మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రాచీన భారతీయ శాస్త్రం అని, ప్రతి ఒక్కరూ యోగా ద్వారా శారీరక-మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రుద్రూర్ మండల భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు కె.వి. మోహన్, పతాంజలి యోగ సమితి మండల అధ్యక్షులు నూతిపల్లి బాలరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఇందూరు జ్యోతి, కిసాన్ విభాగ అధ్యక్షులు పుట్టి ప్రకాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన పదిమంది అభ్యర్థులు బెజుగం వెంకటేశం, బంటు శ్రీనివాస్, పి.శివ ప్రసాద్, లింగాల శంకర్, హనుమండ్లు, సాయిబాబా, తోర్తి చంద్రశేఖర్, గంగ మారుతి తదితరులకు సర్టిఫికెట్లు అందజేశారు.








