|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో పగడ్బందీగా అమలవుతోంది అని, ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ మరియు బెంగళూరు బృందం సభ్యులతో సమావేశం జరిగింది.
కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సమర్థవంతంగా అమలు చేయడం కీలకమని, విద్యార్థుల అభివృద్ధికి AI కీలక పాత్ర పోషిస్తుందని, బెంగళూరు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ మరియు తెలుగు సబ్జెక్టులలో ఏర్పడిన సమస్యలను వివరించగా AI బృందం వాటి పరిష్కారం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.
AI సాఫ్ట్వేర్ రూపొందించిన బృందం సభ్యులు అనంతి ఆకాష్, ప్రీతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు.








