|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 15 మార్చి 2025 నుండి ఈ కోర్సు బోధన్ మండలంలోని మధుమలంచ ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభం అవుతుంది. ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసి పాఠశాల విద్యార్థుల బుద్ధి వికాసానికి, పఠనా సామర్థ్యాలకు సహాయపడేలా ఈ కోర్సును అమలు చేయనున్నారు.
AI ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇనగురేషన్ కు జిల్లా విద్యశాఖ అధికారి అశోక్ కుమార్, ఎంఈఓ నాగయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరీఫ్ ఉద్దిన్, నరేందర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్, హెడ్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయాలతో విద్యార్థులకు శిక్షణ :

ఈ పాఠశాలలో విద్యార్థులకు AI ఆధారిత ఎడ్యుటెక్ శిక్షణ అందించేందుకు 10 కంప్యూటర్లను సిద్ధం చేశారు. స్పెషల్ కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఏర్పాట్లు చేశారు.
ఈ విద్యాభ్యాసంతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయి :
ఈ AI ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత వాడకం ద్వారా విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ AI కోర్సు పాఠశాల విద్యార్థులకు ఆధునిక శిక్షణ ద్వారా వారు భవిష్యత్తులో అత్యుత్తమ నైపుణ్యాలతో సమర్ధులుగా ఎదుగుతారు.








