|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో శనివారం రాందాస్ చౌరస్తా వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో మెదక్ ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ లక్ష్మణ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ,
“ఆ గణనాథుని దివ్యానుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. పదకొండు రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగిన గణేష్ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని, అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతల మధ్య నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరగాలని ఆకాంక్షించారు.

అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ నిమజ్జన శోభాయాత్రలో భక్తి, ఆనందం పరస్పరం కలిసిపోయాయి.
మెదక్ పట్టణంలో ప్రతి ఏడాది జరిగే ఈ వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు గణనాథుని ఆశీర్వాదాలు పొంది సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు.








