పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.

|| దృశ్యం న్యూస్ ||

పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత అంశాలను ప్రజలకు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా విస్తృతంగా యాత్ర చేస్తున్నారు. అలుపెరుగని ప్రయత్నంతో అతను పర్యావరణం ఎలా దెబ్బతింటుందో, అందుకు కారణాలు ఏమిటి మరియు భవిష్యత్తులో మానవ మనుగడకు ప్రమాదం ఎలా ఉండబోతున్నదో పర్యావరణాన్ని ఎలా సంరక్షించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అతను సైకిల్ మీద ప్రయాణించే అన్నిచోట్లా పాఠశాలల విద్యార్థులతో పాటు గ్రామస్థులతో మాట్లాడుతూ, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు, సోమవారం ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చేరుకున్న ఆయన, అక్కడి ప్రజలతో ముచ్చటిస్తూ తన ప్రయాణాన్ని గ్రామస్థులతో విషయాలను తన అనుభవాన్ని పంచుకున్నారు, 2005 ఏప్రిల్ 22న ఈ యాత్రను ప్రారంభించిన అన్బు చార్లెస్, ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లో 50వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసినట్లు తెలిపారు.

అతను పర్యావరణంపై అవగాహన కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు విశేష స్పందన లభిస్తుందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు, విభిన్న భాషలు, రాష్ట్రాల వ్యక్తుల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నానని, కలసిన వారందరినీ పలకరిస్తూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమైందని ఇది మనందరికీ ఎంతో అవసరం అని తెలియజేస్తున్నారు.

అన్బు చార్లెస్ వంటి వ్యక్తులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ ప్రయత్నాలు ఓ మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తూ, ఈ విషయంపై మేక్-ఎ-డిఫరెన్స్ అనే ఆలోచనను ముందుకు తీసుకురావాలి.

ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ మనందరికీ అవసరమని తెలుసుకోడం ద్వారా మన ప్రపంచాన్ని రక్షించుకోవచ్చు.

మీ దృశ్యం న్యూస్.

Join WhatsApp

Join Now

Leave a Comment