|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పట్టణంలోని న్యాలకల్ రోడ్, రోటరీనగర్ లో గల హోవార్డు హై స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా పాల్గొని సందడి చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రముఖులు ఈ వేడుకను వీక్షించి పిల్లల ప్రతిభను మెచ్చుకున్నారు.

ఈ వేడుకలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, మన సంప్రదాయాలు, సంస్కృతిని తెలియజేసే నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. ముఖ్యంగా దేశభక్తిని ప్రదర్శించే ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక నృత్యాలతో ఉత్సాహాన్ని పంచారు.
హోవార్డు స్కూల్ యాజమాన్యం ధన్యవాదాలు

ఈ సందర్భంగా హోవార్డు హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ, ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యతో పాటు, పిల్లలకు మానవీయ విలువలు, భారతీయ సంప్రదాయాల గురించిన అవగాహన కలిగించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ వేడుకలో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు తమ ప్రతిభను అందంగా ప్రదర్శిస్తూ, విద్యతో పాటు ధర్మబోధనపై దృష్టి సారించడాన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు.

ఈ వేడుకలు హోవార్డు హై స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గుర్తుండిపోయేలా జరిగాయి.








