|| దృశ్యం న్యూస్ ||
బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలోని భీమునిగుట్టలో ఉన్న అయ్యప్ప ఆలయంలో శ్రీ ఏక చక్రేశ్వర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మాల స్వాములకు, స్థానికులకు భిక్షా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఏక చక్రేశ్వర శివాలయం చైర్మన్ సుంకోజు హరికాంత్ చారి, వంశీకృష్ణ లక్ష్మీరాజు పటేల్ నిర్వహించారు.

కార్యక్రమం ప్రారంభంలో పూజలు నిర్వహించి, అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో వెంకటేశ్వరరావు, కమల భూమేష్, రాములు, రవీందర్, శ్రీనివాస్ గౌడ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, దీక్ష స్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక భిక్షా స్వీకరించి అనంతరం సేవ చేసారు.
ఈ కార్యక్రమం భక్తులకు మధుర అనుభూతిని కలిగించి, ఆలయ సేవలను మరింతగా ప్రోత్సహించేలా చేసిందని స్థానికులు ఆలయ నిర్వాహకులు తెలిపారు.










