|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థినిని నిజామాబాద్ మాలపల్లి ప్రాంతంలో ఓ ఫకీరు వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయానికి సంబంధించి క్లాస్ టీచర్ వద్దని వాదించిన విన్నవించుకోకుండా ఎస్.ఓ. సహకారంతో గౌతమి విద్యార్థినిని అ ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ సంఘటన చుట్టూ మాక్లూర్ ప్రాంతంలో చాపకింద నీరులా వివాదం పెరిగిపోతుంది, ఎందుకంటే ఇప్పటికే ఎస్.ఓ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని తల్లి తండ్రుల అనుమతి లేకుండా తీసుకుని వెళ్లినట్లు ఫకీరు వద్ద జరిగిన మంత్రాలు వేయించే తంతును చూసి విద్యార్థిని తీవ్ర భయభ్రాంతులకు గురైందాని సమాచారం, ఈ సంఘటనపై తక్షణ చర్యలు అవసరం అని, విద్యార్థి సంఘాల వద్ద వినికిడి ఈ విషయం గురించి ఆధారాలతో సహా సంబంధిత ఉన్నత అధికారులను కలిసి ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టి పాఠశాలలో ఈ రకమైన సంఘటనలను అరికట్టి ఎస్. ఓ. పై కఠిన చర్యలు చేపట్టే వరకు పోరాడుతామని చెప్పినట్లు సమాచారం.










