ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ ||

ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఉన్న లోటు గురించి మీడియాతో మాట్లాడుతూ,

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలోని మెనూ ప్రకారం విద్యార్థులు వారానికి మూడుసార్లు కోడిగుడ్లు వడ్డించాలి కానీ వాటిని అందించడంలో తీవ్ర కొరత ఉన్నదని, పాఠశాలల్లో వంటలు కూడా రుచికరంగా లేకపోవడం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపరచాలని, మధ్యాహ్న భోజనం తయారీకి బాధ్యత వహించే కార్మికులు ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని తెలుపుతూ,
భోజనం తయారీకి ముందు తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయుడు రుచి చూసేలా సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయాలని ఇది విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా మారుతుంది, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నిధులను విడుదల చేయడం లేదని, గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం వల్ల ఆహార నాణ్యత తదితర అవసరాలకు కొరత ఏర్పడుతుందని, ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర 6 రూపాయల 30 పైసలు ఉండగా, ప్రభుత్వం కేవలం 5 రూపాయలు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వంలో అల్పాహారం పేరుతో రూపొందించిన ప్రణాళికలను అమలులో పెట్టాలని AIPSU నాయకులు డిమాండ్ చేస్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల మెస్ బిల్లులు మరియు హాస్టల్ ఖర్చులను సత్వరమే పెంచాలని కోరుతూ, లేనియెడల AIPSU ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో AIPSU నాయకులు దినేష్, రాజు, సాయి కిరణ్, శ్రావణ్ తదితరులు పాల్గొని విద్యార్థుల శ్రేయస్సు కోసం ఏఐపిఎస్యు ప్రయత్నాలు కొనసాగిస్తూ, నాణ్యమైన భోజనం అందించేందుకు నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment