|| దృశ్యం న్యూస్ ||
ఈనెల 28న AIPSU విద్యార్థి సంఘం, యువజన, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చలో పార్లమెంట్ పిలుపులో భాగంగా, AIPSU నిజామాబాద్ జిల్లా నాయకులు ఢిల్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ, విద్య, ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను బలంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి కొఠారి కమిషన్ ప్రకారం కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలి, కానీ ప్రతి సంవత్సరం 2-3 శాతం కంటే ఎక్కువ కేటాయించడంలేదు అని తెలిపారు.
అదేవిధంగా, NEP-2020 పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, విద్యార్థుల అభిప్రాయం లేకుండా ఈ విధానాన్ని అమలు చేయడం దారుణం అని, ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ NCERT సిలబస్ మార్పులను నిలిపివేయాలని, యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నిధులను తగ్గించే కుట్రను మానుకోవాలని అని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫెలోషిప్‌లో కోతలు విధించడం అనే పద్ధతి మానుకోవాలని అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, నగర కార్యదర్శి సందీప్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, ఆనంద్ శివ రాజు స్వామి తదితరులు పాల్గొని ఢిల్లీకి బయలుదేరారు.








