|| దృశ్యం న్యూస్ ||
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం బోధన్ పట్టణంలో మహాలక్ష్మి మందిర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా 12వేల రూపాయల జీవనభృతి అమలు చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
సీతారాం మాట్లాడుతూ, దేశంలో 50% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని, తెలంగాణలో ఈ శాతం 55% ని చేరిందని, వీరి బతుకురోజు ఆధారపడిన పరిస్థితి కాగా, వారికీ ఏడాదంతా సరైన పనులు దొరకడం లేదని, ఆర్థిక నష్టాలపాలవుతున్నారాని, దీంతో, విద్య, వైద్యం మరియు బతకడానికి కావాల్సిన ఆధారం లేకున్ని జంతువుల మాదిరిగా జీవించాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4000 రూపాయలు ఇవ్వాలని, కానీ ఇప్పటివరకు ఈ హామీ అమలవడం లేదని, తక్షణమే 12వేల రూపాయల జీవనభృతి ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AIPKMS నాయకులు జి. పీరాజీ, కబీర్ ఖాన్, పోశెట్టి, సాయిలు, AIPKS జిల్లా నాయకులు పడాల శంకర్, బి. బి. శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.








