|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త ఇంచార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ నీలం మధు శుక్రవారం గాంధీభవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం మధు గాంధీభవన్ వేదికగా జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మీనాక్షి నటరాజన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు పీసీసీ సభ్యుల సమక్షంలో మీనాక్షి నటరాజన్ కు స్వాగతం పలికారు.
నీలం మధు మాట్లాడుతూ, ఎఐసీసీ నూతన ఇంచార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు కొత్త అవకాశాలు ఇవ్వడంతో పాటు, పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు కల్పించడానికి మీనాక్షి నటరాజన్ యొక్క నియామకం ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ నియామకం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం కీలకమైన మలుపుగా చెప్పవచ్చు అని, కాంగ్రెస్ పార్టీ యొక్క పరపతి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం అని, పార్టీ కోసం కృషి చేసిన వారికి అవకాశాలను కల్పించడం వంటివి ఈ నియామకంతో పార్టీలోని నాయకులకు ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు.








