|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ముఖ్యంగా పలు సంఘటనలో బాధితులు కోల్పోయిన ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు తిరిగి అందించడం, బాధితులతో తన ఆప్యాయతను కనబరుస్తూ సమస్యల పరిష్కారానికి తగు మార్గాలు సూచిస్తు ధైర్యం చెబుతూ ఉంటారని, నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సేవలకు గౌరవం తెలుపుతూ అతనిని అభినందించారు.
శ్రీనివాస్ తన ఊరికి, ప్రజలకు సేవ చేయడం తన అదృష్టం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు అని రాజేందర్ పేర్కొన్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధి నిర్వహణలో నిజాయితీగా పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే వారు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారు అని,
శ్రీనివాస్ తన కృషి ద్వారా ఒక ఆదర్శ పోలీస్‌గా నిలబడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు.








