|| దృశ్యం న్యూస్ ||
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా LRS (లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్) దరఖాస్తులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో LRS పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో దరఖాస్తు చేసిన LRS లను క్షేత్ర స్థాయిలో ప్రత్యేక బృందాలు పరిశీలించి సమస్యలు లేని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.

నీటిపారుదల శాఖ, ఎఫ్.టి.ఎల్, రెవెన్యూ ప్రభుత్వ భూమి, చెరువు, శికం, దేవాదాయ, నాల వంటి అంశాలను తనిఖీ చేయాల్సిందిగా సూచించారు.
అదేవిధంగా మున్సిపల్ పంచాయతీ సిబ్బంది డాక్యుమెంటేషన్ తనిఖీ చేయాలని ఉమ్మడి సర్వే బృందం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుదారులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ భుజంగరావు, మెదక్ RDO రమాదేవి, DPO యాదయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులు, MPO మరియు ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.








