|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కీలక కేసులపై పోలీసు దర్యాప్తు వేగం పెరిగింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11న జరిగిన కాంతామణి మహిళ హత్య కేసుకు సంబంధించి సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) బి. ప్రకాష్ స్వయంగా సందర్శించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు వేగవంతంగా, సమగ్రంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ధర్పల్లి మండలం హోన్నజీపేట గ్రామంలో నమోదైన ఎస్సీ/ఎస్టీ చట్టం కేసుపై కూడా ఏసీపీ బి. ప్రకాష్ గ్రామాన్ని సందర్శించి బాధితులు, గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణలో ధర్పల్లి CI బిక్షపతి, SI శ్రీనివాస్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








