|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సాధనలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన త్యాగం, నిస్వార్థ సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.








