రుద్రూర్ విద్యుత్ శాఖ అధికారులకు ఏఏఓ ఆఫీసర్ శివాజీ సూచనలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని విద్యుత్ శాఖ కన్స్యూమర్ ఆఫీసులో ఏఏఓ ఆఫీసర్ శివాజీ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫీల్డ్ వర్క్‌కు వెళ్లి ప్రతి మీటర్‌ను పరిశీలించాలని లోపల ఉన్న మీటర్లను బయట పెట్టాలని అలాగే ఎత్తుగా ఉన్న మీటర్లను 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించారు.

సిఎండి మార్గదర్శకాలు ప్రకారం, మీటర్లు అధికంగా పైభాగంలో ఉండటం మీటర్ రీడర్లకు (OCR – ఆప్షనల్ క్యాప్చర్ రికగ్నైసేడ్) ద్వారా రీడింగ్ తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుందని, మీటర్లు సులభంగా రీడింగ్ చేయగలిగేలా కింద ఉండేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా, ఎక్కువ బకాయిలున్న విద్యుత్ వినియోగదారులకు నోటీసులు జారీ చేసి బిల్లు చెల్లించని వినియోగదారుల కనెక్షన్ నిలిపివేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బోధన్ ఈఆర్‌ఓ అకౌంట్స్ ఆఫీసర్ శివాజీ, అసిస్టెంట్ ఆఫీసర్ రాజు, ఏఈ శ్రీనివాస్, ఎల్‌ఐ రాజేష్, లైన్మెన్లు గంగాధర్ పటేల్, దేశాయ్ శీను, రామకృష్ణ, ఆర్‌సీ సాంబయ్య, అశోక్, సాయి, మీటర్ రీడింగ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment