ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ ||

ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులు ఆరోగ్య పరీక్షలు చేసుకునే అవకాశాన్ని పొందుతు జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దగ్గు, దమ్ము, మరియు ఊపిరితిత్తుల సంబంధిత వైద్యులు డాక్టర్ బల్వీర్ సింగ్ రోగులకు సేవలందించారు.

ఈ ఆరోగ్యమేళాలో 162 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేయడం జరిగింది, అనారోగ్యానికి గురైన వారికి అవసరమైన మందులు ఉచితంగా అందిస్తూ మ‌రిన్ని చికిత్సల కోసం నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ కు చేరుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బల్వీర్ సింగ్, నర్సింగ్ ఆఫీసర్ మమత, సుజాత, మరియు సిబ్బంది భూలక్ష్మి, కృష్ణ, మురళి, పద్మ, సంతోష్, వాజీద్, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment