|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూతుల వద్ద పరిస్థితులను సమగ్రంగా సేకరించాలని సూచించారు.
పోలీసు శాఖ ఈ ఎలక్షన్ కోసం 21 పోలింగ్ స్టేషన్ల వద్ద 8 ఆయుధాల రూట్ మొబైల్ పార్టీలతో విధులు నిర్వహిస్తుందని చెప్పారు. డీస్పీల ఆధ్వర్యంలో QRTలు మరియు స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంటాయి అని,
అదేవిధంగా, 26వ తేదీన జరగబోయే ఏడుపాయల వన దుర్గామాత జాతర సందర్బంగా, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ డైవర్షన్ పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
శివరాత్రి సందర్భంగా, భక్తులు ఏడుపాయల ప్రాంగణంలో నిద్రిస్తారని, మఫ్టీ, క్యూఆర్టి పార్టీలు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించి, దొంగతనాలు జరగకుండా చూడాలని తెలిపారు.
అలాగే స్నానపు ఘాట్ల వద్ద భక్తులు కొంతమంది లోతు ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉండడంతో, అలాంటి ప్రమాదాలను నివారించేందుకు భక్తులకు హెచ్చరికలు ఇవ్వాలని, ఆకతాయిల చర్యలను నివారించడానికి షీ టీం బృందాలు, మఫ్టీ పార్టీలు ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.








