|| దృశ్యం న్యూస్ ||
బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “బాన్సువాడ నియోజకవర్గంలోని పట్టభద్రులు 27వ తేదీన జరిగే MLC ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని” పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








