|| దృశ్యం న్యూస్ ||
ఈ రోజు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే టి యు సి ఐ ( T U C I ) విబాగంలో ఐ ఎఫ్ టి యు ( I F T U ) విలీనా సభకు బోధన్ ఏరియా నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు.
ఈ సభలో పాల్గొనడానికి బీడీ, భవన మరియు ఇతర నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు తదితర రంగాల కార్మికులు సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమంలో I F T U రాష్ట్ర కమిటీ నాయకుడు బి. మల్లేష్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల పై మరింత అణిచివేత చేస్తున్నారని ఈ విషయం పై కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని వివరించారు, మోడీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు, మత ఉన్మాద దృక్పథాలు, ఫాసిస్టు విధానాలు దేశంలో విస్తరించడమే కాకుండా, కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది అని ఈ నేపథ్యంలో కార్మికుల ఐక్యతకు మరియు సమిష్టి ఉద్యమానికి పునాది వెయ్యడానికి IFTU సిద్ధంగా ఉంది అని, గత సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా టి యు సి ఐ తో అనేక చర్చలు జరిపి ఒక ఉమ్మడి ప్రణాళికను ఆమోదించి, I F T U ని TUCI లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నామని ఈ నిర్ణయాన్ని ఈరోజు సభలో అధికారికంగా ప్రకటించనున్నట్లు మల్లేష్ తెలిపారు.

అదేవిధంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల పై పోరాటం చేయడం, సమాన పనికి సమాన వేతనం అందించడానికి, కనీస వేతనాల జీవో సవరణ కోసం కఠినమైన ఉద్యమాలు చేపడతామని మల్లేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక ప్రతినిధులు బి.నాగమణి, ఆర్ లక్ష్మి, కళావతి, బీపాషా బేగం, మధ్యాహ్న భోజన పథకం ప్రతినిధులుగా రెహానా బేగం, (B O C) భవన నిర్మాణ కార్మికుల ప్రతినిధులుగా కే.రవి, మధు, జర్రు, ఏ. గంగారాం, కిషన్, ఆంజనేయులు,కె. సురేష్, ఎస్.సురేష్, మున్సిపల్ కార్మికుల ప్రతినిధులుగా సాదుల మరియమ్మ, సి.హెచ్. ప్రభాస్, సి.హెచ్ చిన్న ప్రభాస్ లు పాల్గొన్నారు.










