|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామ పరిధిలోని చెరువు కట్టకు రంధ్రం ఏర్పడటంతో చెరువులో నిల్వ ఉన్న నీరు వృథాగా బయటకు పారుతోంది. ఆ నీరు పంట పొలాల గుండా ప్రవహించి బర్దిపూర్ చెరువులోకి చేరుతోంది. ప్రస్తుతం వరి పంటలు కోత దశలో ఉండగా, చెరువునుంచి పారుతున్న నీటి కారణంగా పంట పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితి కొనసాగితే కోతకు సిద్ధమైన పంటలు పూర్తిగా నష్టపోతాయని తెలిపారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టలోని రంధ్రాన్ని మూసివేయాలని, మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చెరువుల సంరక్షణకు సరైన సమయానికి మరమ్మత్తు చర్యలు తీసుకోకపోతే, రైతులకు తీవ్ర నష్టాలు తప్పవని పలువురు అధికారులను హెచ్చరిస్తున్నారు.








