|| దృశ్యం న్యూస్ ||
దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన పుట్టినరోజున ధర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ మేధా హైస్కూల్ లో గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులందరూ కలిసి కేక్ కట్ చేసి రామానుజన్ యొక్క జీవితంలో ఉన్న గణిత శాస్త్ర వైభవాన్ని వివరించారు.

కరస్పాండెంట్ మదన్ సురేష్ మాట్లాడుతూ, “శ్రీనివాస రామానుజన్ అనగానే గణిత శాస్త్రం గుర్తుకువస్తుంది అని, ఆయన అందరికీ గణిత సమస్యలను సులభంగా వివరించిన గొప్ప నిపుణుడు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీమేద హైస్కూల్ ప్రిన్సిపాల్ జయరెడ్డి, ఉపాధ్యాయులు అరవింద్, గోపి, రమాదేవి, శృతి, సోనీ, స్రవంతి, అనీషా, రాసగ్న, జ్యోతి, రిషిక, మౌనిక, కీర్తన విద్యార్థులు పాల్గొన్నారు.








