|| దృశ్యం న్యూస్ ||
ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో ఉన్న చౌక ధరల దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నెలలో కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచబడుతోందాని మిగతా రోజుల్లో రేషన్ డీలర్ జరీనా బేగం దుకాణం మూసివేస్తుండటం పై స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చౌక ధరల దుకాణాలు ప్రతి నెల 1 నుంచి 15 వరకు అందుబాటులో ఉండాలని నిబంధనలు వున్న, అయితే పెర్కిట్ గ్రామంలో ఉన్న దుకాణం సంఖ్య (1804035) కేవలం మూడు రోజులు మాత్రమే తెరిచి ఉండటంతో స్థానిక ప్రజలు ఇతర గ్రామాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవలసిన పరిస్థితి ఎదురవుతోంది.
ఈ సంఘటన స్థానిక ప్రజల సౌకర్యానికి ఓ సమస్యగా మారింది, ఈ విషయమై గతంలో వార్తలు వెలువడ్డాయి కానీ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని. స్థానికులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, ఇకనైనా రేషన్ డీలర్ పై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారు నిబంధనల ప్రకారం దుకాణాన్ని తెరచి ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.








