“అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న ” విలేకరుల కష్టా నష్టాల పై భజన పాట.

|| దృశ్యం న్యూస్ ||

సిరికొండ గ్రామంలోని దేవి మండపంలో జరిగే శతనవరాత్రి ఉత్సవాల్లో, యువకుడు దాసరి మురళి

“అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న” అనే భజన పాట ద్వారా విలేకరుల కష్టాలను బాధ్యతలను స్థానికులకు వివరించారు. ఈ పాటలో విలేకరులు ఎదుర్కొనే కష్టాలు, నష్టాలు, వారి కుటుంబ పరిస్థితుల గురించి నిజాయితీగా తెలియజేయడం జరిగింది.

విలేకరుల బాధ్యతలు ఎంత గణనీయమైనవి, సమాజానికి అందించే సేవలు ఎంతో విలువైనవి అంటూ పలు విషయాలను పాట ద్వారా ప్రస్తావించారు, విలేకరులు సాధారణంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, మరియు ప్రాణానికి ప్రమాదం వంటి విషయాలను న్యాయమైన దృష్టికోణంలో వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక విలేకరులు, మురళి యొక్క ప్రతిభను ప్రశంసిస్తూ, ఆయన పాట ప్రజల్లో అవగాహన పెంచేందుకు సహాయపడుతుందని అభినందించారు. మురళి యొక్క ఈ భజన సంగీత ప్రదర్శన, విలేకరుల కష్టాలను స్పష్టంగా చూపిస్తూ, వారి బాధ్యతలను గుర్తింపులోకి తీసుకువచ్చిందాని,

ఈ విధంగా ఇలాంటి గ్రామలలో జరుగుతున్న ఉత్సవాలు విలేకరుల సమాజానికి చేసే సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎంతో మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment