మెదక్ జిల్లా ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుండి వచ్చిన మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా తెలియజేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేశారు. కొన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక సిఐలు, ఎస్ఐలకు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్టబద్ధ మార్గంలోనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ప్రజల భద్రత మరియు శాంతి కాపాడటం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment