ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – రైతులకు అండగా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. వర్షాల ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులు తేమ శాతం తగ్గిన తర్వాతనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.
అలాగే ప్రతి కేంద్రంలో టార్పాలిన్ సదుపాయం, మౌలిక వసతులు, మూమెంట్ రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లను ఫ్లెక్సీపై తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. నవంబర్ మొదటి వారం నుంచి మరింత ధాన్యం రావచ్చని, ఈలోగా ఉన్న ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment