ధర్పల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గుడి తండాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బాబూరామ్ నాయక్, గౌరవ అధ్యక్షుడు భూక్యా చంద్రు నాయక్, యువజన అధ్యక్షుడు దారావత్ గోపాల్ నాయక్ నాయకత్వం వహించారు. మండల అధ్యక్షునిగా మంగిత్య నాయక్, ప్రధాన కార్యదర్శిగా లౌడియా శ్రీనివాస్ నాయక్, యువజన అధ్యక్షునిగా బాదావత్ రవి కుమార్ నాయక్, యూత్ జనరల్ సెక్రటరీగా మలావత్ లాల్ సింగ్, ఖజాంచీగా బాణావత్ మంగులాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షునిగా బాదావత్ సేవాలాల్ నాయక్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. నాయకులు మాట్లాడుతూ బంజారా సమాజ హక్కులు, సంస్కృతి, గౌరవాన్ని కాపాడటానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ దురుద్దేశాలతో బంజారాలను విభజించాలనే ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బంజార ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment