|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం పోలీస్ సిబ్బందితో పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను సమీక్షించారు. మహేందర్ పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, యూనిఫాం డ్రస్ కోడ్, విధులపట్ల చురుకుదనం వంటి అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, పరేడ్లు పోలీస్ సిబ్బందిలో ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదగా, వినయంగా వ్యవహరించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచిస్తూ, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ పరేడ్‌లో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








