|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 237 ప్రభుత్వ, పబ్లిక్ స్కూల్‌లకు సంబంధించిన “బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకం” నిధులు 220 కోట్ల రుపాయలు ఇంకా విడుదల చేయబడలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, నిధుల విడుదల లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావితమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంలో నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ను తక్షణమే విడుదల చేయాలని AIPSU డిమాండ్ చేస్తూ,
అదనంగా, రాష్ట్రంలోని శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్స్కు పక్క భవనాలు నిర్మించాలి, విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు సకాలంలో అందించాలి, అలాగే విద్యార్థినులకు సానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందించాలి అని ప్రభుత్వని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రెండు సంవత్సరాలు గడిచినా, విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై చర్చ జరగకపోవడం సిగ్గుచేటుగా ఉందని వారు విమర్శించారు. AIPSU ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మోద్దు నిద్ర వదలాలి అని, వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో AIPSU జిల్లా అధ్యక్షులు సాయికుమార్, ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్, నాయకులు యశ్వంత్, సూర్య పాల్ తదితరులు పాల్గొన్నారు.








