|| దృశ్యం న్యూస్ ||
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు.
డీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.
సంగారెడ్డిలోని రెడ్లస్ ఇన్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశం మరియు అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నీలం మధు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏఐసీసీ సెక్రటరీ, అబ్జర్వర్ సజరిట్ లైత్ ప్లాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, “పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో కలసి కృషి చేస్తాం అని, అధిష్టానం ఎవరినైనా డీసీసీ అధ్యక్షుడిగా నియమించినా, మేమంతా పూర్తిస్థాయిలో సహకరిస్తాం,” అని అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో అబ్జర్వర్లు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారని, బూత్ నుండి బ్లాక్ స్థాయి వరకు నేతల అభిప్రాయాలు సేకరించి తుది నివేదిక ఏఐసీసీకి అందజేస్తారని పేర్కొన్నారు.








