తెలంగాణ కొత్త డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమితులైన శివధర్ రెడ్డి‌ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలసి డీజీపీకి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో మెదక్ జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులు, నేర నియంత్రణ చర్యలు, నేర నిరోధక వ్యూహాలు మరియు పోలీసు విభాగం పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. జిల్లా పోలీసు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన భద్రతా సేవలు అందించే దిశగా డీజీపీ సూచనలు చేశారు.
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్ జిల్లాలో పోలీసు విభాగం పనితీరును మరింత బలోపేతం చేయడంలో నూతన డీజీపీ మార్గదర్శకత్వం కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు విభాగం ప్రజల భద్రత, శాంతి స్థాపన, నేరాల నియంత్రణలో ముందంజలో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment