|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని సొసైటీని ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని, రైతులు అవసరమైన సందర్భంలో మాత్రమే ఎరువులను వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే రైతులు రాబోయే యాసంగి సీజన్‌లో నానో యూరియా వాడాలని, దీని ద్వారా పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి కోతల పనులను సమయానికి చేపట్టడం చాలా ముఖ్యం అని అన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ తరఫున రైతులకు అవసరమైన మార్గదర్శకాలు, సాంకేతిక సలహాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని గోవింద్ స్పష్టం చేస్తూ, రైతులు ఎరువులను అధికంగా వాడకూడదని, సమతుల్యంగా వినియోగించుకోవాలని, ఆధునిక పద్ధతులతో సాగు చేస్తేనే అధిక దిగుబడి సాధ్యమవుతుందని చెప్పారు.








