మెదక్ సుందరీకరణ, ప్రజల యోగక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెరువుల పునరుద్ధరణ పనులపై శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల కింద 10 కోట్లు లభ్యమవుతున్నాయని, తాత్కాలిక, శాశ్వత పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యాలపై ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, మెదక్ సుందరీకరణపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డి.ఇతో సమావేశమై “ఐ లవ్ మెదక్” నినాదంతో మెదక్ పట్టణాన్ని అన్ని జిల్లాల్లో వినూత్నంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎంట్రన్స్ రోడ్లు, లైటింగ్, చౌరస్తాలు, బ్రాస్ మెటీరియల్‌తో అంబేద్కర్ విగ్రహం, చర్చిలో సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈ సర్దార్ సింగ్, పంచాయతీరాజ్ ఈ నరసింహులు, ఇరిగేషన్ ఈ శ్రీనివాసరావు, ముఖ్య ప్రణాళికా అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment