|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ సందర్భంగా 546 మంది పోలీస్ సిబ్బంది, 4 QRT టీమ్స్‌తో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో 204 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు అమలు చేస్తున్నారు.
నిమజ్జన ర్యాలీల కోసం ప్రత్యేక మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, వెలుతురు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.పి హెచ్చరించారు. నిమజ్జనం సమయంలో ప్రజలు క్రమబద్ధంగా పాల్గొనాలని సూచించారు. ప్రమాదాల నివారణకు క్రేన్‌లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.








