|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు ఎన్నో త్యాగాల ఫలితమని, భవిష్యత్ తరాలు దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రధాన అతిథిగా ప్రముఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ సందీప్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
చిన్నారులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో కనిపించి అందరి మనసులను దోచుకున్నారు. అనంతరం విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి గీతాలు, నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రత్న తేజ, కరస్పాండెంట్ టివిఆర్ మూర్తి, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.








