|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ దినేష్ కులాచారి మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు.
పార్టీ సంస్థాగత బలాన్ని పెంచి, ప్రతి గ్రామం నుంచి ఒక నాయకుడిని వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా తయారు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పద్మా రెడ్డి, మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ యాదవ్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ద్వారా పార్టీకి కొత్త ఉత్తేజం లభించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.








