|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామంలోని పవిత్ర రామన్న పాదాలు (రామగిరి పాదాలు) ఆలయానికి నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ దర్శన నిమిత్తం మంగళవారం రానున్నారు.
పరిపూర్ణానంద స్వామీజీ అనుమతితో వృశికేశ్ లో వేద విద్యను అభ్యసించి, కోయంబత్తూరులో ఉన్నత విద్యను పూర్తి చేసి, ఆదిశంకరాచార్య బ్రహ్మసూత్రాలకు బాస్యం రచించిన తత్వవేత్తగా పేరు పొందారు. నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ బోధిస్తున్న తత్వం మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవ్వరూ వినిపించని గొప్ప సారాన్ని కలిగి ఉంటుందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. హిందూవులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.








