ధర్పల్లి: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక బహుమతులు అందజేసిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్‌కు చెందిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్, ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం తన పూర్వ పాఠశాలను సందర్శించి, పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మలావత్ నరేష్ ₹5000, లౌఢియ కళ్యాణ్ ₹3000 నగదు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ పాఠశాల వల్లనే నేను ఉన్నత స్థాయికి చేరగలిగాను. ప్రతి విద్యార్థి పదవ తరగతిని జీవిత మార్గదర్శకంగా భావించాలి,” అని సూచించారు.

అలాగే హంసవాహిని స్కూల్‌కి చెందిన గడ్డం అకిరా నందన్ రెడ్డి, జిర్రా రుచితలకు కూడా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కొండా అనిల్ కుమార్, ఆర్మూర్ రంజిత్, మిట్టపల్లి ప్రవీణ్, జలంధర్, పిండిరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment