ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా జిల్లా వాసులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుందని, ప్రజల జీవితాల్లో ఉగాది పచ్చడిలా షడ్రుచులు సమతులంగా నిండిపోవాలని ఆకాంక్షించారు.

ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని, కొత్త ఏడాది ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరారు. ఉగాది పండుగ అందరికీ అభివృద్ధి, శాంతి, సమృద్ధి కలిగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment