|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ బాబు పై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో, బోయి భాగ్య అనే మహిళపై సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులు రావడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్పందించారు.
ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరిపి సీఐ విజయ్ బాబు పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఛార్జ్ మెమో జారీ చేశారు. పోలీస్ శాఖలో నైతిక విలువలు పాటించాల్సిన బాధ్యత ఉన్నందున అధికార దుర్వినియోగం సహించబోమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ చర్యలతో, పోలీస్ వ్యవస్థలో బాధ్యతా పరిధి పెంపొందించి, ప్రజలకు న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని కమిషనర్ పేర్కొన్నారు.








