పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని : డి.ఆర్.డి.ఓ.పి డి శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ ||

సోమవారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఓ.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “జిల్లాలో 118 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించాల్సి ఉంది అని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో 65 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తాహసిల్దార్ నవీన్ మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఓటింగ్ పూర్తి అయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నోడల్ అధికారిని అడిగి ఓటింగ్ వివరాలను తెలుసుకోవాలని డి.ఆర్.డి.ఓ. పిడి సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment