సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి ఉత్సవం.

|| దృశ్యం న్యూస్ ||

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్, మాల మహానాడు ఆధ్వర్యంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి పిప్పెర సంజీవ్, జాగృతి రూరల్ కన్వీనర్ సాయి చరణ్, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్, అధ్యక్షుడు మూలుగు రాజేశ్వర్ మరియు ఇతర ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించి పౌరులకు సమాన హక్కులను కల్పించడంలో అద్భుత కృషి చేశారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆకు గంగారం, బోడ గణేష్, ధనుంజయ్, లక్కం నర్సయ్య, ములుగు అరుణ్, లక్కం నవీన్, సుంకర్ రాకేష్, రాహుల్, కోలా మోహన్ రాజు, నరేందర్, ములుగు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment