|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు మరియు భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత పల్లె కిష్టయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఫౌండర్ అల్లారం రత్నయ్య మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ అంబేద్కర్ మహానీతిని స్మరించుకున్నారు. దేశ అభ్యున్నతిలో అంబేద్కర్ పాత్రను గౌరవిస్తూ ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రతిజ్ఞ చేశారు.








