|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ మరియు సితాయిపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు డిఆర్డిఓ సాయ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా, అదనపు కలెక్టర్ రైతుల సౌకర్యాలను సమీక్షించారు, రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ ధాన్యం విక్రయించమని సూచించారు.
అదేవిధంగా “రైతులు దళారులపై ఆధారపడకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ఉత్పత్తులను విక్రయించాలి అని, ధాన్యములో తేమశాతం 17 ఉండేటట్లు చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, ఐకెపి సునీత, అనసూయ, లత, మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా తీసుకునే ఈ చర్యలు, పంటల మార్కెట్‌కి సహాయపడగలవని భావిస్తున్నారు.








