|| దృశ్యం న్యూస్ ||
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో కొక్కొండ వెంకటి ఆకస్మాత్తు మరణించడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలలో చిక్కుకుంది, ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జంగమ సమాజ్ కార్యదర్శి మరియు వర్ని సొసైటీ డైరెక్టర్ గంగప్ప మానవతా దృక్పదంతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చొక్కం వీరయ్య, వార్డ్ మెంబర్ అనంత్ రావు, పిల్లి దత్తు, సంపతి చిట్టి మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సహాయం బాధిత కుటుంబానికి కొంత ఊరట కలిగింస్తుందని భవిస్తూ, సమాజంలో ఏ విధమైన కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ విధమైన సహాయం ఎంతో కీలకమైంది అని తెలిపారు.








