|| దృశ్యం న్యూస్ ||
బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ,
రైతు భరోసా కార్యక్రమం అమలు చేయకపోవడం, “రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి” అని ధాన్యం కొనుగొలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
రైతులకు క్షేమకరమైన పద్ధతిలో ఆదాయాన్ని అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 58 సంవత్సరాల పైబడిన రైతులకు నెలకు 10,000 రూపాయల పింఛన్, పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టి నాగన్న, మండల అధ్యక్షుడు పడాల శంకర్, అఖిల భారత ప్రగతి శీల కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నసీర్, మండల నాయకులు సిద్ధ పోశెట్టి, శంకర్, గంగారం మరియు అనేక కార్యకర్తలు పాల్గొన్నారు.










